మాస్ రాజా మరో ప్రయోగానికి సిద్ధమా..!

బెంగాల్ టైగర్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తో రాజా ది గ్రేట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహరాజ్ రవితేజ ఆ సినిమాతో హిట్ అందుకోగా ఆ తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు సినిమాతో నిరాశ పరచాడు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణతో నేల టికెట్ సినిమా చేస్తున్న రవితేజ ఈమధ్యనే శ్రీను వైట్లతో అమర్ అక్బర్ ఆంటోనీ మూవీని మొదలు పెట్టాడు. ఇక ఈ రెండిటి తర్వాత విఐ ఆనంద్ డైరక్షన్ లో సినిమా ఓకే చేసే ఆలోచనలో ఉన్నాడట రవితేజ. 

ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ రవితేజకు ఓ కథ వినిపించాడట. చర్చల అనంతరం రవితేజ విఐ ఆనంద్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమా కూడా ఆనంద్ ముందు సినిమాల్లానే ప్రయోగాత్మకంగా ఉంటుందట. ఆల్రెడీ రాజా ది గ్రేట్ తో ప్రయోగం అంటూ బ్లైండ్ గా నటించిన రవితేజ ఇప్పుడు మళ్లీ ప్రయోగం అంటే ఎలాంటి సినిమాతో వస్తాడో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.