చరణ్ కోసం మిల్కీ ఐటం..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న రంగస్థలం రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండగా ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను సినిమా షురూ చేసిన సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో భరత్ అనే నేనులో మహేష్ తో జోడి కట్టిన కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.  

ఈ సినిమాలో ఐటం గాళ్ గా మిల్కీ బ్యూటీ తమన్నా మెరవబోతుందట. ఇప్పటికే రంగస్థలంలో పూజా హెగ్దె జిగేల్ రాణి అంటూ దుమ్మురేపగా ఈసారి మిల్కీ అందాలతో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడట చరణ్. బోయపాటి మార్క్ మాస్ అంశాలకు ఏమాత్రం కొదవ లేకుండా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబేరాయ్ విలన్ గా నటిస్తున్నాడు.