
నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈరోజు హైదరాబాద్ లోకి రామకృష్ణ సిని స్టూడియోలో అట్టహాసంగా మొదలైంది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన ఎన్.టి.ఆర్ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం భారీగానే జరిగింది.
తేజ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మొదటి రోజు బాలకృష్ణ ఎన్.టి.ఆర్ దానవీరసూరకర్ణ సెట్ లో దుర్యోదన లుక్ లో కనిపించారు. బయోపిక్ సినిమానే అయినా కచ్చితంగా ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమాగా తీర్చిదిద్దుతున్నారట. సినిమా దర్శకుడు తేజ దసరా కల్లా ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు తెలిపారు. సినిమాలో బాలయ్య దాదాపు 60 దాకా డిఫరెంట్ గెటప్పుల్లో కనిపిస్తారని అంటున్నారు.