సైరాకు షాక్ ఇచ్చిన అమితాబ్..!

టైటిల్ చూసి మళ్లీ సైరాలో అమితాబ్ చేస్తున్నాడా.. చేయట్లేదా.. కొంపదీసి ఫైనల్ గా సినిమా చేయడం కుదరదని చెప్పాడా అన్న ఆలోచనలు రావొచ్చు. కాని ఇక్కడ మ్యాటర్ అది కాదండి.. ఆల్రెడీ సైరా కోసం బిగ్ బీ డేట్స్ ఇచ్చేశాడు కూడా. అయితే టెస్ట్ షూట్ కోసం అమితాబ్ కు ఓ మేకప్ వేశారు. దాన్ని కాస్త తన సోషల్ బ్లాగ్ లో పెట్టి సైరా టీం కు షాక్ ఇచ్చాడు బిగ్ బీ.

సైరా విషయంలో ప్రతి విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుదామనుకుంటున్న చిత్రయూనిట్ కు అమితాబ్ పెద్ద స్ట్రోకే ఇచ్చాడు. ఉయ్యాలవాడ నర సింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు.