
రాం చరణ్ రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అంటూ డీజే భామ పూజా హెగ్దె ఓ ఐటెం నెంబర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కొద్ది గంటల క్రితం ఆ సాంగ్ ప్రోమో వదిలారు. జిగేల్ రాణిగా పూజా హెగ్దె అందాలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని చెప్పడంలో సందేహం లేదు. సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ రంగస్థలం సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.
రాం చరణ్ చిట్టిబాబుగా నటిస్తున్న ఈ సినిమాలో సమంత ఫీమేల్ లీడ్ రోల్ చేసింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అవగా.. ముఖ్యంగా ఈ జిగేల్ రాణి మాస్ ప్రియులకు మాంచి కిక్ ఇచ్చే పాట అవుతుందని అంటున్నారు. రాం చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఫుల్ పాక్డ్ ఎంటర్టైనర్ గా సుకుమార్ మార్క్ తో వస్తున్న ఈ రంగస్థలం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మరో మూడు రోజుల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.