
స్టార్ మా బ్రాండింగ్ పెంచేయడంలో బిగ్ బాస్ షో బాగా ఉపయోగపడింది. ఎన్టీఆర్ హోస్ట్ గా బుల్లితెర మీద సంచలనం సృష్టించిన బిగ్ బాస్ సీజన్ 1 అనుకున్న దానికన్నా ఎక్కువ ప్రేక్షకాదరణ పొందింది. అయితే బిగ్ బాస్ సీజన్-2కి ఎన్టీఆర్ కష్టమే అని తెలుస్తుంది. అయినా సరే తారక్ క్రేజ్ ను వాడుకోవాలని చూస్తుంది స్టార్ మా.
అందుకే రాబోతున్న ఐపీఎల్ మ్యాచ్ లకు తెలుగు కామెంటరీ ఛానెల్ పెట్టి దానికి తారక్ తో బ్రాండింగ్ ఇప్పించాలని చూస్తున్నారు. ఐపీఎల్ సీజన్ మొత్తం యాడ్స్, ప్రోమోస్ వంటి వాటికి ఎన్.టి.ఆర్ ను వాడేస్తారట. దీనికి స్టార్ మా తారక్ కు పెద్ద మొత్తంలో ముట్టచెబుతున్నారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి కచ్చితంగా ఐపీఎల్ తెలుగు కామెంటరీ ఛానెల్ కూడా సూపర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు.