
మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబోలో వస్తున్న రంగస్థలం సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అధినేతల మీద ఐటి దాడులు జరిగాయి. మైత్రి మూవీస్ ఆఫీస్, నిర్మాతలు నవీన్, రవి శంకర్, మోహన్ ముగ్గురి మీద ఐటి దాడులు జరిపారట. సినిమా రిలీజ్ కు మరో మూడు రోజులే ఉండటంతో బిజినెస్ క్లోజ్ అవుతుందని తెలిసి ఐటి దాడులు జరిపినట్టు తెలుస్తుంది.
అంతేకాదు ఇదే సంస్థ నాగ చైతన్య సవ్యసాచి సినిమాను నిర్మిస్తుంది. దానికి సంబందించి లావాదేవీలు కూడా ఆఫీస్ లో జరుగుతున్నాయట. అయితే రంగస్థలం సినిమాకు సరిగ్గా మూడు రోజులు ముందు పక్కా ప్లానింగ్ తో ఈ రైడ్స్ జరగడం సినిమా యూనిట్ కు నిర్మాతలకు షాకింగ్ గా మారింది. మరి ఈ రైడింగ్ లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్నది ఇంకా బయట పడలేదు.