
అక్కినేని నట వారసుడిగా అఖిల్ హీరోగా చేసిన రెండు సినిమాలు నిరాశ పరచాయి. అఖిల్ తో పోలిస్తే హలో పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా మాత్రం కిక్ ఇవ్వలేదు. అందుకే తన 3వ సినిమా కోసం మళ్లీ కొంత గ్యాప్ తీసుకున్న అఖిల్ ఫైనల్ గా తొలిప్రేమ డైరక్టర్ వెంకీ అట్లూరికి ఓకే చెప్పాడు. ఈ సినిమాకు సంబందించిన ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి.
బి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జార్జ్ సి విలియంస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వరుణ్ తేజ్ కు ఫిదా తర్వాత తొలిప్రేమ లాంటి సూపర్ హిట్ ఇచ్చి తన కెరియర్ స్ట్రాంగ్ అయ్యేలా చేసిన వెంకీ అఖిల్ కెరియర్ బూస్ట్ ఇచ్చేలా కమర్షియల్ హిట్ ఇస్తాడో లేదో చూడాలి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఈ సినిమా ఓపెనింగ్ లో నాగార్జునతో పాటు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా పాల్గొనడం విశేషం.