
రంగస్థలం తర్వాత సుకుమార్ చేయబోయే సినిమా ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అసలైతే బన్నితో సినిమా చేయాల్సి ఉండగా అది ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉందట. ఇక లేటెస్ట్ గా సుకుమార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. బాహుబలి తర్వాత సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత సినిమా కూడా రాధాకృష్ణ కు ఓకే చెప్పాడని అంటున్నారు.
ఆ సినిమా పూర్తయ్యాక కాని సుకుమార్ తో సినిమా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో బన్ని కూడా నటించే ఛాన్స్ ఉందని టాక్. ఇప్పటికే మెగా నందమూరి మల్టీస్టారర్ తో రాజమౌళి చరిత్రలో నిలిచిపోయేలా సినిమా చేస్తుండగా.. సుకుమార్ కూడా ఇప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్ లతో కలిసి సినిమా చేసి మరో చరిత్ర సృష్టించాలని చూస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన మిగతా డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.