బన్నితో డేటింగ్ కు రెడీ..!

కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కాస్టింగ్ కౌచ్ ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయం గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన హీరోయిన్ శ్రీరెడ్డి ఆ వార్తల ద్వారా మంచి మైలేజ్ ఏర్పరచుకుంది. స్టార్ హీరోల దగ్గర నుండి కో ఆర్డినేటర్స్ దాకా ఎవరిని వదలని శ్రీరెడ్డి టాలీవుడ్ లో ఏ హీరోతో డేటింగ్ కు వెళ్తారని యాంకర్ అడుగగా సెకన్ కూడా ఆలోచించకుండా అల్లు అర్జున్ అనేసింది.

బన్నిలోని ఎనర్జీ తనకు బాగా ఇష్టమని.. తన స్టైలిష్ యాక్టింగ్ కు తాను పెద్ద ఫ్యాన్ అంటుంది శ్రీరెడ్డి. అంతేకాదు కొన్ని విషయాల్లో బన్నిది తనది ఒకేరకమైన మెంటాలిటీ అని తనని అల్లు అర్జున్ తో పోల్చుకుంటుంది శ్రీరెడ్డి. ఇక డేటింగ్ అంటూ వెళ్లాల్సి వస్తే బన్నితో రెడీ అంటుంది. ఆల్రెడీ పెళ్లై ఇద్దరు పిల్లలున్న బన్ని మీద శ్రీరెడ్డి కన్నేసింది. మరి అమ్మడి ఆఫర్ కు బన్ని ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి.