
పూర్తిస్థాయి రాజకీయ ప్రచారంలో బిజీగా మారిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా ఫంక్షన్స్ కు అటెండ్ అవడం అంటే చాలా కష్టమే అని చెప్పాలి. కాని ఈ నెల 25న జరుగబోయే ఛల్ మోహన్ రంగ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటెండ్ అవబోతున్నారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఆ సినిమా హీరో నితిన్ ఎనౌన్స్ చేయడం విశేషం.
కృష్ణ చైతన్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ సమర్పకుడిగా ఉన్నారు. ఇక ఈ సినిమా కథను కూడా త్రివిక్రం అందించడం జరిగింది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్ మెలోడీగా బాగున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ఓకే చెప్పడం నితిన్ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిపెడుతుంది. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ అవుతుంది.