
సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా కథ నచ్చి మరి శ్రీహరి నాను దగ్గర కోటి రూపాయలకు కొనేశాడు కొరటాల శివ. అయితే ఈ కథ అతను రాసుకుంది మాత్రం పవన్ కళ్యాణ్ కోసమట. అంతేకాదు పవన్ కు ఈ కథ వినిపించాడట శ్రీహరి నాను. 2014 ఎన్నికల టైంలోనే ఈ కథ విన్నాడట పవన్ కాకపోతే తను పార్టీ పెట్టేది కేవలం సిఎంగా అయ్యేందుకు మాత్రమే అన్న మాట వస్తుందని పవన్ కాదన్నాడట.
మొత్తానికి పవన్ కోసం రాసుకున్న ఈ కథ భరత్ అనే నేనుగా మహేష్ చెంత చేరింది. ఈమధ్యనే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద మరింత అంచనాలు పెంచేసింది. మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచిన పోకిరి, అతడు సినిమాలు ముందు పవన్ కాదన్నవే.. మరి ఆ సెంటిమెంట్ తో పోల్చుకున్న భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ అవడం ఖాయమని అంటున్నారు.