మెసేజ్ లు ఇచ్చి విసిగించకూడదు..!

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా ఉపేంద్ర మాధవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎం.ఎల్.ఏ. లక్ష్మి కళ్యాణం తర్వాత కాజల్ తో కలిసి సినిమా చేసిన కళ్యాణ్ రాం ఈ సినిమా ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయడం పక్కా అని అంటున్నారు. సినిమాలో సీరియస్ పాయింట్ ఉన్నంత మాత్రాన సినిమా ఆడేస్తుందని అనుకుంటే పొరపాటే దానికి ఉదాహరణ తను నిర్మించిన ఓం అని అన్నారు కళ్యాణ్ రాం. 

ప్రేక్షకులకు మెసేజ్ ఇచ్చి విసిగించకూడదు. మెసేజ్ పేరుతో హిం సించడం మానేసి కాస్త ఉత్సాహపరిస్తే చాలని అంటున్నాడు. ముఖ్యంగా ఈ ఎం.ఎల్.ఏ సినిమా అలాంటి కోవకే చెందినదని అంటున్నారు. ఎమ్మెల్యే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా కథల మీద తన మనసులోని మాట చెప్పారు కళ్యాన్ రామ్. ఈ సినిమాతో పాటుగా జయేంద్ర డైరక్షన్ లో నా నువ్వే సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రాం. లవ్ స్టోరీగా రాబోతున్న ఆ సినిమాలో కళ్యాణ్ రాం సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది.