'యాత్ర' టైటిల్ తో వైఎస్ బయోపిక్.. హీరోగా సూపర్ స్టార్..!

కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్న వైఎస్ బయోపిక్ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. లాస్ట్ ఇయర్ ఆనందో బ్రహ్మ సినిమా డైరెక్ట్ చేసిన మహి వి రాఘవ ఈసారి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తీస్తున్నారు. ఆనందో బ్రహ్మ నిర్మించిన 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే విజయ్ చిల్లా, శషి దేవి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

ఇక ఈ బయోపిక్ లో వైఎస్ గా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. 1992లో స్వాతి కిరణం, 1996లో సూర్య పుత్రులు తర్వాత మమ్ముట్టి మలయాళ పరిశ్రమలోనే బిజీ స్టార్ గా మారారు. రెండు దశాబ్ధాలకు పైగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న మమ్ముట్టి వైఎస్ సినిమాకు ఓకే చెప్పడం విశేషం.   

ఇక వైఎస్ రాజకీయ జీవితంలో పాదయాత్ర చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుకే ఈ సినిమా టైటిల్ ను యాత్ర అని నిర్ణయించారు. రాజకీయ నేత, ప్రజా నాయకుడిగా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ప్రత్యేకమైన సినిమాగా ఉంటుందని చెబుతున్నారు. సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.