పోసాని మాట.. రాజకీయాల్లోకి కళ్యాన్ రామ్..!

కళ్యాణ్ రాం హీరోగా ఉపేంద్ర మాధవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎం.ఎల్.ఏ. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది. ఎన్.టి.ఆర్, బాలకృష్ణ ఇద్దరిలో ఎవరో ఒకరు గెస్ట్ గా వస్తారని అనుకున్న ఈ ఈవెంట్ కాస్త చిత్రయూనిట్ సమక్షంలోనే జరిగింది. ఇక ఈ వేడుకలో మాట్లాడిన పోసాని కళ్యాణ్ రాం రాజకీయాల్లోకి రావాలని అన్నారు.

తెలుగు దేశం పార్టీ మీది.. హీరోలు కోట్లకు కోట్లు డబ్బులు సంపాదిస్తుంటారు. కాని హరికృష్ణ, కళ్యాణ్ రాం మాత్రం మరి కొంతమందికి జీవితాన్ని ఇస్తున్నారని అన్నారు. ఇక పోసాని మాటల మధ్యలో కళ్యాణ్ రాం అనబోయి పవన్ కళ్యాణ్ అని అన్నారు. సడెన్ గా మళ్లీ మాట మార్చేశారు. ఈమధ్య పొలిటికల్ స్పీచ్ లతో హడావిడి చేస్తున్న పవన్ అందరికి బాగా ఎక్కేశాడని అంటున్నారు. మరి పోసాని చెప్పినట్టు కళ్యాణ్ రాం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారేమో చూడాలి.