ఏప్రిల్ 12 నుండి మొదలు పెడుతున్న ఎన్టీఆర్..!

అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జై లవ కుశ తర్వాత ఎన్.టి.ఆర్ తన హిట్ మేనియా కొనసాగించేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో తారక్ ఫ్రెష్ లుక్ లో కనిపిస్తారట. సినిమా ముహుర్తం ఎప్పుడో పెట్టేసుకోగా సెట్స్ మీదకు మాత్రం వెళ్లలేదు అసలైతే ఈ నెల 26న షెడ్యూల్ అనుకోగా అది కుదరలేదు.

అందుకే ఏప్రిల్ 12 నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. రామోజి ఫిల్మ్ సిటీలో ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఉంటుందని తెలుస్తుంది. ముందు సినిమాలో పాట షూట్ చేస్తారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె, శ్రద్ధా కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ దసరా బరిలో దించాలని చూస్తున్నారు.