
పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలతో హిట్లు కొట్టిన అనీల్ రావిపుడి దర్శకుడిగా తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. రాజా ది గ్రేట్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న అనీల్ తన తర్వాత సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ ఉగారి రోజు ఉంటుందని తెలుస్తుంది. వైజాగ్ లో స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుని వచ్చిన అనీల్ వెంకటేష్, వరుణ్ తేజ్ లకు కథ చెప్పడం వారి నుండి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడం జరిగిందట.
ఎఫ్-2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ టైటిల్ తో ఈసారి అనీల్ తన మార్క్ సినిమానే అయినా క్రేజీ మల్టీస్టారర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కథ కథనాలు అన్ని కొత్తగా ఉండే ఈ సినిమాలో బాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్స్ స్పూరితో వస్తుందని తెలుస్తుంది. వెంకీ, వరుణ్ క్రేజీ కాంబినేషన్ లో ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. అనీల్ కాన్ఫిడెంట్ చూస్తుంటే ఈ సినిమాతో మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ కొనసాగేలా చేస్తాడని అంటున్నారు.