
మహానటి సావిత్రి బయోపిక్ గా నాగ అశ్విన్ డైరక్షన్ లో మహానటి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ శివాజి గణేషన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా నుండి అఫిషియల్ ఫస్ట్ లుక్ ఇప్పటివరకు రాలేదు. అయితే ఇప్పుడు మహానటి ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. మహానటిలో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ ల లుక్ లీక్ అయ్యింది.
ఈ లుక్ చూస్తే సావిత్రిగా కీర్తి సురేష్ ను తీసుకున్న దర్శక నిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటున్నారు. ఇక అచ్చం సావిత్రిలానే అనిపించేలా కీర్తి సురేష్ లుక్ ఉంది. ఇక ఈ ఫస్ట్ లుక్ లీక్ అవడంపై దర్శక నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు. మార్చి 29న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పుడు జూలైకి పోస్ట్ పోన్ అయ్యింది. లీకైన పిక్ తో సినిమాపై మరింత అంచనాలు పెరుగగా సినిమా అనుకున్న రేంజ్ హిట్ సాధిస్తుందని అంటున్నారు సిని ప్రియులు.