
కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ డైర్క్షన్ లో వచ్చిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా. 2016 సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా సంచలన విజయం అందుకోవడమే కాదు 50 కోట్ల కలక్షన్స్ తో నాగార్జున స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో బంగార్రాజు పాత్ర ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ పాత్రని బాగా ఎంజాయ్ చేశారు.
అయితే అదే పాత్రతో సినిమా మొత్తం నడిచేలా ఓ కథ సిద్ధం చేశాడు కళ్యాణ్ కృష్ణ. సినిమా టైటిల్ గా బంగార్రాజు అనే పెట్టారు. అయితే సినిమా కథ బాగున్నా కథనంలో తేడా కొట్టేయడంతో సినిమా వెనక్కి తగ్గారు. అయితే ప్రస్తుతం వర్మ ఆఫీసర్ సినిమా చేస్తున్న నాగ్ ఆ తర్వాత నానితో మల్టీస్టారర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ రెండిటి తర్వాత నాగార్జున బంగార్రాజుని లైన్ లో పెట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ కూడా రవితేజతో నేల టికెట్ సినిమా చేస్తున్నాడు. మొత్తానికి బంగార్రాజుని చూడాలనుకున్న అక్కినేని ఫ్యాన్స్ కోరిక నెరవేరబోతుంది.