కమిట్మెంట్ c/o చరణ్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న రంగస్థలం సినిమాలో పూర్తిస్థాయిలో మేకోవర్ తో కనిపిస్తున్నాడు. చిట్టిబాబుగా చరణ్ లుక్ మాస్ అభిమానులకు బాగా నచ్చేసింది. అయితే ధ్రువ తర్వాత ఈ సినిమా కన్ఫాం చేసిన చరణ్ సుకుమార్ చెప్పిన విధానం ప్రకారం గెడ్డెం పెంచేశాడు. 2016 డిసెంబర్ నుండి 2018 అంటే దాదాపు 480 రోజుల దాకా చరణ్ సినిమా కోసం గెడ్డం తోనే ఉన్నాడట.

ఈ రకంగా స్టార్ హీరో ఫుల్ కమిట్మెంట్ తో ఉండటం అది రాం చరణ్ కే సాధ్యమైందని ఫ్యాన్స్ తెగ ఉత్సాహంగా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రంగస్థలం సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సూపర్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ నెల 30న రిలీజ్ అవనున్న ఈ సినిమాకు చెర్రి పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తుందో లేదో చూడాలి.