
నారా వారి ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన రోహిత్ తన మార్క్ చూపించాలని కొత్తగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బాణం నుండి అప్పట్లో ఒకడుండేవాడు, శమంతకమణి దాకా డిఫరెంట్ ప్రయోగాలు చేసిన రోహిత్.. బాలకృష్ణుడు అంటూ రొటీన్ కమర్షియల్ సినిమా చేశాడు అది కాస్త నిరాశ పరచే సరికి మళ్లీ తన పంథాలో ఎక్స్ పెరిమెంట్స్ కు సిద్ధమయ్యాడు.
ప్రస్తుతం మంజునాథ్ డైరక్షన్ లో సినిమా ఓకే చేసిన నారా రోహిత్ ఈ సినిమాలో మూగవాడిగా నటిస్తున్నాడట. ఇప్పటికే రంగస్థలంలో రాం చరణ్ చెవిటి వ్యక్తిగా.. రాజా ది గ్రేట్ లో రవితేజ గుడ్డివానిగా నటించారు. ఇక వారి పంథాలోనే రోహిత్ మూగవాడిగా నటిస్తున్నాడు. ప్రయోగాత్మకంగా సాగే ఈ సినిమా కథ, కథనాలు కూడా చాలా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది. మరి నారా రోహిత్ ఈ మూగ ప్రయత్నం అయినా తనకు ఓ మంచి కమర్షియల్ సక్సెస్ అందించాలని ఆశిద్దాం.