అఖిల్ నో చెప్పిన కథతో రామ్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నక్కిన త్రినాధ రావు డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో గురు ప్రేమకోసమే. నాగార్జున సినిమా పాట అయిన ఈ టైటిల్ అక్కినేని హీరోలకు అయితే బాగుంటుందని తెలిసినా సరే దిల్ రాజు ఈ టైటిల్ రామ్ కోసం వాడుతున్నాడు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా కథను ముందు అఖిల్ కు వినిపించాడట డైరక్టర్ త్రినాధరావు.   

సినిమా చూపిస్త మావ, నేను లోకల్ సినిమాలతో హిట్ అందుకున్న ఈ డైరక్టర్ చెప్పిన కథకు అఖిల్ కన్విన్స్ అవలేదట. అందుకే ఆ సినిమా వదులుకున్నాడు. అఖిల్ కాదన్న కథనే కాస్త మార్చి రామ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు త్రినాధరావు. హలో తర్వాత ఎలాంటి సినిమా ఓకే చేయాలా అని అఖిల్ తర్జన భర్జనలో ఉన్నాడు. ఒకవేళ రాం సినిమా హిట్ అయితే కనుక మంచి సినిమా మిస్ అయినట్టే లెక్క.