
నాచురల్ స్టార్ నాని హీరోగా మేర్లపాక గాంధి డైరక్షన్ లో వస్తున్న సినిమా కృష్ణార్జున యుద్ధం. నాని డ్యుయల్ రోల్ చేస్తూ వస్తున్న ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. అనుకున్నట్టుగానే టీజర్ తో అలరించాడు నాని. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని కృష్ణార్జున యుద్ధంతో కూడా హిట్ కొట్టేలానే ఉన్నాడు. రిలీజ్ అయిన టీజర్ లో ఒకరు మాస్ లుక్ లో కనిపిస్తే మరొకరు క్లాస్ లుక్ లో కనిపించారు.
ఇక ప్లే బోయ్ గా నాని నటన పీక్స్ అనిపించేలా ఉందని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది. ఎక్స్ ప్రెస్ డైరక్టర్ మేర్లపాక గాంధి పకడ్బందీ స్క్రిప్ట్ తో ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించాడని చెప్పొచ్చు. ఏప్రిల్ 1న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాతో నాని మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని అంటున్నారు.