నితిన్ ఛల్ మోహన్ రంగ పెద్దపులి సాంగ్..!

నితిన్ హీరోగా కృష్ణ చైతన్య డైరక్షన్ లో వస్తున్న సినిమా ఛల్ మోహన్ రంగ. త్రివిక్రం కథతో పాటుగా పవన్ కళ్యాణ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కూడా ఆడియెన్స్ ను అలరించింది. ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ కాగా ఇప్పుడు థర్డ్ నెంబర్ అది కూడా పెద్దపులి సాంగ్ రీమిక్స్ చేయడం జరిగింది. 

అమెరికా వీసా వచ్చిన హీరోకి ఫ్రెండ్స్ ఎలా విషెష్ చెప్పారన్నది ఈ సాంగ్ మీనింగ్. పెద్దపులి సాంగ్ రీమిక్స్ చేసి ఈ సాంగ్ కంపోజ్ చేశారు. సాంగ్ మొదలవడమే మంచి ఊపు తెస్తుంది ఇక సినిమాలో ఈ సాంగ్ సూపర్ హిట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మధ్య తమన్ మంచి ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే. మ్యూజికల్ హిట్లు కొడుతూ సక్సెస్ మేనియా కొనసాగిస్తున్న తమన్ నితిన్ కు సూపర్ హిట్ ఇస్తాడని అంటున్నారు.