అక్కినేని కోడలుగా మారిన తర్వాత సెలెక్టెడ్ సినిమాలను చేస్తున్న సమంత మొదటిసారి తన భర్త నాగ చైతన్యతో జత కట్టబోతుంది. నిన్ను కోరి డైరక్టర్ శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా షైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చైతు, సమంత కలిసి నటించడం సూపర్ క్రేజ్ దక్కించుకుంది.
ఇక ఈ సినిమా టైటిల్ గా ప్రేయసి అని పెట్టబోతున్నారట. నిన్ను కోరి లాంటి ఫెయిల్యూర్ లవ్ స్టోరీని కూడా ప్రేక్షకులు మెప్పించేలా తీసిన దర్శకుడు శివ నిర్వాణ. ఇప్పుడు రియల్ లైఫ్ లవ్ కపుల్ చైతు, సమంతతో ఎలాంటి కలర్ ఫుల్ సినిమా చేస్తాడో చూడాలి. ప్రస్తుతం నాగ చైతన్య సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు సినిమాలు చేస్తుండగా.. సమంత రంగస్థలం, యూటర్న్ సినిమాల్లో నటిస్తుంది.