ఆటాడే వెంకటేష్ ఎలా ఉన్నాడంటే..!

గురు తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా తేజ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆటా నాదే వేటా నాదే. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ కలిపి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీయ శరణ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ ప్రొఫెసర్ గా కనిపిస్తాడని అంటున్నారు. దీనికి సంబందించిన ఓ పిక్ బయటకు వచ్చింది. వెంకటేష్ క్లాసీ లుక్ లో స్టిల్ అదిరిపోయింది.

వెంకటేష్ లుక్ దగ్గుబాటి ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది. నేనే రాజు నేనే మంత్రి సినిమా తర్వాత తేజ చేస్తున్న ఈ సినిమా వెంకటేష్ ను హిట్ ట్రాక్ ఎక్కించేయడం ఖాయమని అంటున్నారు. సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నిజంగానే వెంకీ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. లీక్ అయిన ఫస్ట్ లుక్ మాత్రం అదరిపోయిందని అంటున్నారు.