
మెగా పవర్ స్టార్ రాం చరణ్, సుకుమార్ కాంబోలో వస్తున్న రంగస్థలం సినిమా ఈ నెల 30న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతున్న ఈ మూవీ వెస్ట్ గోదావరిలో హయ్యెస్ట్ రేటుకి అమ్ముడయ్యింది. మెగా హీరోల సినిమాలన్నిటిని క్రాస్ చేసి వెస్ట్ గోదావరిలో రంగస్థలం 6.03 కోట్లకు వి3 ఎంటర్టైన్మెంట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150 సినిమానే 5.40 కోట్లకు అమ్ముడవగా దానికి మరో 50 లక్షలు ఎక్కువగానే రంగస్థలం రేటు పలికింది.
సినిమా రేంజ్ ను పెంచేలా వచ్చిన టీజర్. పక్కా హిట్ బొమ్మే అనేలా దేవి మ్యూజిక్ అన్ని కలిసి సినిమా బిజినెస్ కూడా భారీగా చేసేలా చేస్తున్నాయి. చిట్టిబాబుగా చరణ్ చెవిటి వ్యక్తిగా నటిస్తున్న ఈ పల్లెటూరి ప్రేమకథను చూడాలంటే మార్చి 30 దాకా వెయిట్ చేయాల్సిందే. ధ్రువ సక్సెస్ తర్వాత తన రేంజ్ పెంచుకున్న చెర్రి ఈ రంగస్థలం సినిమాను హిట్ కొట్టి మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.