మోడీని టార్గెట్ చేస్తూ కొరటాల శివ ట్వీట్..!

ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ మీద జరుగుతున్న గొడవల సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రివర్గంలో ఉన్న టిడిపి మంత్రులు కూడా తమ రాజీనామాలను ప్రకటించారు. ఢిల్లీలో కూడా ఈ విషయంపై అంతా హాట్ హాట్ గా ఉంది. ఇక ఏపి స్పెషల్ స్టేటస్ పై కేంద్రం, ప్రధాని మోడీ చూపిస్తున్న ఉపేక్షను ఉదహరిస్తూ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఏకంగా మోడీ మనిషిగా మారాలంటూ ట్వీట్ చేశారు.     

మహేష్ తో భరత్ అనే నేను సినిమా చేస్తున్న కొరటాల శివ ఇచ్చిన మాట తప్పితే మనిషే కాదు అన్న డైలాగ్ రాశాడు. అలానే ఏపికి ఇచ్చిన మాట ప్రకారం స్పెషల్ స్టేటస్ ఇచ్చి ఆయన మనిషిగా మారాలని ట్వీట్ చేశాడు కొరటాల శివ. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరో పక్క కేంద్ర ప్రభుత్వం ఏపి స్పెషల్ స్టేషస్ పై మొండితనం గురించి కలక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా ట్వీట్ చేశారు. ఏపి మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని. తెలంగాణా కూడా ఏపికి స్పెషల్ స్టేటస్ కు సపోర్ట్ చేస్తుంటే ఇచ్చేందుకు మీకేమైంది అంటూ మోహన్ బాబు ఫైర్ అయ్యారు.