
రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. పల్లెటూరి నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా మార్చి 30న రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అవగా ఇప్పుడు మూడవ సాంగ్ రంగమ్మా.. మంగమ్మా అనే సాంగ్ రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని స్పెషల్ గా ఉన్నాయి.
ముఖ్యంగా ఈరోజు రిలీజ్ అయిన రంగమ్మా.. మంగమ్మా సాంగ్ సమంత సోలో సాంగ్ అనిపిస్తుంది. ఎంత సక్కగున్నావే పాట చరణ్ హీరోయిన్ గురించి పాడితే ఈ పాట హీరో తనని పట్టించుకోవట్లేదని చెబుతూ సాంగ్ వచ్చింది. మాస్ ఆడియెన్స్ కు నచ్చేలా దేవి బీట్ అదిరిపోయింది. ఈ నెల 18న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ హంగామా మొదలు పెట్టాలని చూస్తున్నాడు రాం చరణ్.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, ఆది పినిశెట్టి కూడా స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. యాంకర్ అనసూయ కూడా సినిమాలో చరణ్ కు మేనత్త రోల్ లో నటిస్తుందని అంటున్నారు.