
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నక్కిన త్రినాథరావు డైరక్షన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా హలో గురు ప్రేమకోసమే అని పెట్టారు. అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సాంగ్ అయిన పాటతోనే టైటిల్ పెట్టేశారు చిత్రయూనిట్. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఉన్నది ఒకటే జిందగి తర్వాత రామ్, అనుపమ కలిసి నటిస్తున్న సినిమా ఇది.
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా లవ్ స్టోరీగా రాబోతుందని టైటిల్ చూస్తేనే అర్ధమవుతుంది. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ హిట్ తర్వాత నక్కిన త్రినాథరావు చేస్తున్న సినిమా హలో గురు ప్రేమకోసమే. మామా అల్లుళ్ల మధ్య జరిగే ప్రేమ యుద్ధమే ఈ సినిమా కథ అని అంటున్నారు. నేను శైలజ తో హిట్ అందుకున్న రామ్ ఉన్నది ఒకడే జిందగి సినిమాతో వెనక్కి తగ్గాడు మరి ఈ సినిమాతో అయినా మళ్లీ సూపర్ హిట్ కొడతాడో లేదో చూడాలి.