కన్నుగీటిన పిల్లకు క్రేజీ ఆఫర్..!

ఒరు ఆధార్ లవ్ టీజర్ తో కోట్లమంది హృదయాలను కొల్లగొట్టిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ లలో ట్రెండీగా మారింది. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో కాని ప్రియాకి మాత్రం ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అమ్మడి ఫాలోయింగ్ ను చూసి అందరు షాక్ అవుతున్నారు. ఇక ఈ ఫాలోయింగ్ ను చూసే వాణిజ్య కంపెనీలు ప్రియాకు ఆఫర్లు ఇస్తున్నాయి.


మా కంపెనీ యాడ్ ప్రమోట్ చేస్తే చాలు లక్షల రెమ్యునరేషన్ ఇస్తామని అంటున్నారట. తన కనుసైగలతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నే పడేసిన ఈ అమ్మడు ఈమాత్రం క్రేజ్ దక్కించుకుందంటే కామనే అని చెప్పాలి. అంతర్జాలం అంతా షేక్ అయ్యేలా చేసిన ప్రియా తన గురించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ట్రెండ్ అవుతుండటం విశేషం. అందుకే కంపెనీలు ఆమె వెంట పడుతున్నారు.