
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వక్కంతం వంశీ కాంబోలో వస్తున్న సినిమా నా పేరు సూర్య. బన్ని సోల్జర్ గా కనిపించనున్న ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. సినిమా నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లవ్ సీన్స్ కూడా బాగా వచ్చాయట.
అయితే సినిమా కంటెంట్ మిస్ గైడ్ చేసేలా ఉన్నాయని ఫుల్ రషెస్ చూశాక లవ్ సీన్స్ కత్తించాలని కోరాడట బన్ని. బన్ని సలహాకు డైరక్టర్ కూడా ఓకే చెప్పాడని తెలుస్తుంది. విశాల్-శేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజికల్ గా కూడా ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వనుంది. మే 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా బన్ని హిట్ మేనియాను కంటిన్యూ చేస్తుందని అంటున్నారు. మరి నా పేరు సూర్యతో అల్లు అర్జున్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.