మెగా నందమూరి మల్టీస్టారర్.. ఆ క్రేజీ హీరోయిన్..!

రాజమౌళి డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి చేస్తున్న సినిమా గురించి తెలిసిందే. అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు బాక్సర్స్ గా కనిపిస్తారట. ఈ మెగా నందమూరి మల్టీస్టారర్ లో హీరోయిన్స్ కు యమ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాలో ఎవరు హీరోయిన్ గా ఛాన్స్ పట్టేస్తారా అని ఆడియెన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

మొన్నామధ్య ఈ సినిమాలో రాశి ఖన్నాని సెలెక్ట్ చేశారని వార్తలు రాగా.. ఇప్పుడు సమంత కూడా ఎన్.టి.ఆర్, చరణ్ సినిమాలో సెలెక్ట్ అయ్యిందని అంటున్నారు. రాజమౌళి ఈగ సినిమాలో నటించిన సమంత ఆ సినిమా హిట్ కు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టిన తర్వాత సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్న సమంత ప్రస్తుతం రాం చరణ్ తో రంగస్థలం సినిమా చేస్తుంది. మరి మెగా నందమూరి మల్టీస్టారర్ లో సమంత ఉందంటే ఆ ప్రాజెక్టుకి మరింత క్రేజ్ వచ్చేసినట్టే.