ఎడ్యుకేషన్ సిస్టెం మీద భరత్ విజన్..!

సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ముఖ్యమంత్రిగా పెద్ద భాధ్యతనే మోస్తున్న మహేష్ అమ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా భరత్ అనే నేను సినిమా రబోతుంది. అయితే ఈ సినిమాలో సిఎంగా మహేష్ స్టైలిష్ లుక్ లో అదరగొట్టడమే కాకుండా ఓ ఇంటెన్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంతేకాదు ముఖ్యమంత్రి మహేష్ ఎడ్యుకేషన్ సిస్టెం మీద గురి పెట్టాడని టాక్.

నేటి బాలలే రేపటి పౌరులు.. రేపటి ప్రపంచం బాగుండాలి అంటే ఇప్పుడు పిల్లలు సరిన విద్యనభ్యసించాలి. ఇదే కథతో మహేష్ సినిమా వస్తుందట. అంతేకాదు ఎడ్యుకేషన్ సిస్టెం మీద కూడా కొరటాల మార్క్ చురకలు ఉంటాయని తెలుస్తుంది. అయితే టీజర్ లో అక్కడక్కడ శ్రీమంతుడు పోలికలు కనిపిస్తున్నా మొత్తానికి మరోసారి కొరటాల శివతో కలిసి మహేష్ మ్యాజిక్ చేయాలని చూస్తున్నాడు.

మరి ఆ మ్యాజిక్ ఎంతగా వర్క్ అవుట్ అయ్యింది అన్నది ఏప్రిల్ 20న తెలుస్తుంది. విజన్ ఆఫ్ భరత్ అంటూ ప్రామిస్ అంటూ గంభీరంగా చెప్పిన మహేష్ చూస్తుంటే ఈ సినిమాతో రికార్డుల చెడుగుడు ఆడుతాడని తెలుస్తుంది.