కమల్, విక్రం సినిమాలో నితిన్.. వాటే లక్కీ ఛాన్స్..!

ఇద్దరు విలక్షణ నటులు కలిసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్టులో లవర్ బోయ్ నితిన్ కూడా సెలెక్ట్ అవడం విశేషం. అది కూడా తమిళ డెబ్యూకి ఇంతకంటే గొప్ప అవకాశం ఏది రాదని చెప్పొచ్చు. కమల్ హాసన్ నిర్మాతగా రాజేష్ సెల్వ డైరక్షన్ లో సినిమా వస్తుంది. చియాన్ విక్రం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోగా నితిన్ కు లక్కీ ఛాన్స్ వచ్చిందట.

కమల్, విక్రం, నితిన్ అసలేమి సంబంధం లేని ఈ ముగ్గురు కలిసి సినిమా చేయడం క్రేజీగా మారింది. తెలుగులో లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న నితిన్  ఈ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇస్తున్నాడు. మరి నితిన్ కోలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి. కమల్ తో చీకటి రాజ్యం సినిమా తీసిన రాజేష్ విక్రం ఇమేజ్ కు సరిపోయే అద్భుతమైన కథతో వస్తున్నాడట.