నందిని రెడ్డికి తెలంగాణా ప్రభుత్వం అరుదైన గౌరవం..!

ప్రముఖ లేడీ డైరక్టర్ నందిని రెడ్డి అందరికి తెలుసినవారే. కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఆమె అలా మొదలైంది సినిమాతో డైరక్టర్ గా మొదటి ప్రయత్నమే హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత జబర్దస్త్ సినిమా ఫ్లాప్ అవగా కళ్యాణ వైభోగమే సినిమాతో మాత్రం హిట్ అందుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో సినిమాకు ఫిక్స్ చేసుకున్న నందిని రెడ్డికి తెలంగాణా ప్రభుత్వం సత్కారం అందనుంది.   

మార్చి 8 మహిళా దినోత్సవం నాడు తెలంగాణా ప్రభుత్వం అన్ని రంగాల నుండి ప్రముఖులను 20 మెంబర్స్ ను సెలెక్ట్ చేసి సత్కరించబోతున్నారు. ఈ క్రమంలో సినిమా ఫీల్డ్ నుండి నందిని రెడ్డికి సత్కారం జరుగబోతుంది. దర్శకురాలిగా నందిని రెడ్డి తన ప్రతిభ చాటుకుంటుంది. ఆమె ప్రతిభకు ప్రోత్సాహం అందించేలా ఈ సత్కారం జరుగనుందట. తెలంగాణా ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి.