భరత్ అనే నేను టీజర్.. ప్రామిస్ ఇది పక్కా హిట్టు బొమ్మే..!

సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమంతుడు తర్వాత వస్తున్న సినిమా భరత్ అనే నేను. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సొసైటీపై ఓ వ్యక్తి తన అమ్మకిచ్చిన మాట కోసం ముఖ్యమంత్రిగా ఎలాంటి భాధ్యతలను నిర్వర్తించాడు అన్నది సినిమా కథ. సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. బాలీవుడ్ భామ కైరా అద్వాని  హీరోయిన్ గా నటిస్తుంది. ఏప్రిల్ 20న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ముఖ్యంగా టీజర్ లో డైలాగ్స్ కొరటాల శివ మార్క్ తెలియచేస్తున్నాయి. 

సినిమా టీజర్ తోనే హిట్ కళ వచ్చిందని చెప్పొచ్చు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్న భరత్ అనే నేను టీజర్ అంచనాలను పెంచడమే కాదు సినిమాపై ఇంకాస్త ఆసక్తిని పెంచింది.