సూర్య లుక్ అదరగొట్టాడు..!

విలక్షణ నటుడు సూర్య హీరోగా ప్రయోగాత్మక డైరక్టర్ సెల్వ రాఘవన్ డైర్క్షన్ లో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాకు టైటిల్ గా ఎన్.జి.కే అని పెట్టారు. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సూర్య లుక్ అదిరిపోయింది. సూర్య ఎన్.జి.కే ఫస్ట్ లుక్ చెగొవెరాతో పోల్చుతున్నారు ఫ్యాన్స్. కచ్చితంగా ఇది అందరి అంచనాలను మించి ఉంటుందని అంటున్నారు.


సూర్య, సెల్వ రాఘవన్ ఈ కాంబినేషన్ ఊహించని విధంగా ఏర్పడింది. ప్రస్తుతం ఓ సూపర్ హిట్ కొట్టాలన్న కసితో ఉన్న సూర్యకు ఎన్.జి.కే ఆ హిట్ ఇచ్చేలానే ఉంది. కాన్సెప్ట్ పోస్టర్ గా అనిపిస్తున్నా స్టోరీ ఏంటన్నది మాత్రం బయటపడలేదు. ఫస్ట్ లుక్ పోస్టర్ ట్రెండింగ్ లో ఉండగా సూర్య ఈ సినిమాతో మళ్లీ మునుపటి ఫాం లోకి వచ్చేలా కనిపిస్తున్నాడు.