
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఏ మంత్రం వేశావే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక పరశురాం డైరక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ తమిళ డెబ్యూకి రంగం సిద్ధమైంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథతో విజయ్ తమిళ సినిమా ఉంటుందట.
ఆ సినిమాలో విజయ్ పొలిటిషియన్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఆనంద్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను జ్ఞావెల్ రాజా నిర్మిస్తున్నారట. ఇక విజయ్ నటించిన అర్జున్ రెడ్డి సినిమా తమిళ్ లో బాలా డైరెక్ట్ చేస్తుండగా విక్రం తనయుడు ధ్రువ్ అందులో హీరోగా నటిస్తున్నాడు. తమిళ అర్జున్ రెడ్డికి వర్మ అనే టైటిల్ పెట్టారు.