
సినిమాలైతే చేస్తున్నా కమర్షియల్ గా సక్సెస్ కొట్టడంలో వెనుకపడిన మెగా హీరో వరుణ్ తేజ్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఫిదాతో హిట్ ట్రాక్ ఎక్కేశాడు. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఫిదా తర్వాత వరుణ్ తేజ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన తొలిప్రేమతో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు వరుణ్ తేజ్. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన తొలిప్రేమ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.
ఇక ప్రస్తుతం సంకల్ప్ రెడ్డితో సినిమా చేస్తున్న వరుణ్ తేజ్ అప్పట్లో ఒకడుండేవాడు సినిమా డైరక్టర్ సాగర్ చంద్ర డైరక్షన్ లో కూడా సినిమా కన్ఫాం చేశాడట. అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో సత్తా చాటిన డైరక్టర్ సాగర్ చంద్ర. డిఫరెంట్ సబ్జెక్ట్ తో వరుణ్ తేజ్ ను ఇంప్రెస్ చేశాడట. సంకల్ప్ సినిమా స్పేస్ లో చిత్రీకరణ జరుగుతుందట. మొత్తానికి వరుణ్ తేజ్ వరుస ప్రయోగాలతో కెరియర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.