90వ ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే..!

90వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ అవార్డుల ఎంపిక జరిగిందని చెప్పొచ్చు. ఇక ఈ అవార్డుల కార్యక్రమంలో ప్రధానంగా ఉత్తమ చిత్రంగా 'ది షేప్ ఆఫ్ వాటర్' సినిమా అవార్డ్ కైవసం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాకు ఉత్తమ దర్శకునిగా గిలెర్మో డెల్ టోరో అవార్డ్ దక్కించుకున్నారు.

ఉత్తమ నటుడిగా గ్యారీ ఓల్డ్ మన్, డార్కెస్ట్ అవర్ సినిమాకు గాను అందుకోవడం జరిగింది. ఫ్రాన్సెస్న్ మెక్ డోర్మాండ్ త్రీ బిల్ బోర్డ్స్ ఔట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సౌరీ సినిమాలకు ఉత్తమనటి గా అవార్డ్ కైవసం చేసుకున్నారు. ఇక ఆస్కార్ అవార్డులను అందుకున్న మరికొన్ని సినిమాల జాబితా ఎలా ఉందో చూడండి.


ఉత్తమ లఘుచిత్రం (యానిమేటెడ్) – డియర్ బాస్కెట్‌బాల్

ఉత్తమ చిత్రం (యానిమేటెడ్) – కోకో

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – బ్లేడ్ రన్నర్ 2049

ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ – లీ స్మిత్ (డన్‌కిర్క్)

ఉత్తమ ఒరిజినల్ స్కోర్ – అలెగ్జాండర్ డెస్ప్లాట్ (ది షేప్ ఆఫ్ వాటర్)

ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – రిమెంబర్ మి: కోకో (సంగీతం: క్రిస్టెన్ అండెర్సన్, రచన: రాబర్ట్ లోపెజ్)

ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్) – హెవెన్ ఈజ్ ఎ ట్రాఫిక్ జామ్ ఆన్ ద 405

ఉత్తమ లఘుచిత్రం (లైవ్ యాక్షన్) – ది సైలెంట్ చైల్డ్

ఉత్తమ విదేశీ చిత్రం – ఎ ఫెంటాస్టిక్ ఉమన్ (చిలీ)

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – జేమ్స్ ఐవరీ (కాల్ మి బై యువర్ నేమ్)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – జోర్డాన్ పీలే (గెట్ ఔట్)

ఉత్తమ ఛాయాగ్రహణం – రోజర్ ఎ. డీకిన్స్ (బ్లేడ్ రన్నర్ 2049)

ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్ – డార్కెస్ట్ అవర్

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – మార్క్ బ్రిడ్జెస్ (ఫాంటమ్ త్రెడ్)

ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్) – ఐకారస్

ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ – డన్‌కిర్క్

ఉత్తమ సౌండ్ మిక్సింగ్ – డన్‌కిర్క్

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – ది షేప్ ఆఫ్ వాటర్