వెంకటేష్ తో ఛాన్స్ పట్టేసింది..!

గురు తర్వాత తేజ డైరక్షన్ లో విక్టరీ వెంకటేష్ చేస్తున్న సినిమా ఆటా నాదే వేటా నాదే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సురేష్ బాబుతో కలిసి ఈ సినిమా నిర్మాణం జరుగుతుంది. ఈ నెల 12 నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్న ఈ సినిమాలో శ్రీయ మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అవగా ఇప్పుడు సెకండ్ లీడ్ గా ఈషా రెబ్బకు ఛాన్స్ వచ్చిందట. ఈమధ్యనే అ! సినిమాతో అలరించిన ఈ అమ్మడు వెంకటేష్ తో నటించే ఛాన్స్ పట్టేసింది. 

ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వచ్చిన అంతకుముందు ఆ తర్వాత సినిమాతో తెరంగేట్రం చేసిన ఈషా రెబ్బ ఆ సినిమా హిట్ అయినా అందుకు తగిన అవకాశాలు తెచ్చుకోలేదు. ప్రస్తుతం తేజ మూవీలో వెంకటేష్ తో రొమాన్స్ చేస్తుంది. మరి ఈ సినిమాతో అమ్మడికి లక్ కలిసి వస్తుందేమో చూడాలి. తెలుగు హీరోయిన్ గా ఈమధ్య కాలంలో ఓ మోస్తారు క్రేజ్ తెచ్చుకున్న ఈషా రెబ్బ గ్లామర్ షోకి దూరమని చెప్పేసింది. అందుకే అవకాశాలు చాలా వస్తున్నా సెలెక్టెడ్ సినిమాలనే చేస్తుంది.