
సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా రిపబ్లిక్ డే నాడు రిలీజ్ చేసిన ఫస్ట్ ఓత్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచేలా వచ్చిన మహేష్ సిఎం ప్రమాణ స్వీకారం సినిమాలో కంటెంట్ దమ్ము చూపించింది. ఇక ఈ సినిమా నుండి విజన్ ఆఫ్ భరత్ గా టీజర్ రాబోతుంది.
మార్చి 6న ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తారట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ సిఎంగా కనిపించనున్నాడు. ఏప్రిల్ 20 రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ, మహేష్ కలిసి చేస్తున్న ఈ సినిమా కాన్సెప్ట్ ఫిల్మ్ గా రాబోతుందని తెలుస్తుంది. మరి మహేష్ అభిమానులు మార్చి 6 నుండే సినిమా పండుగ మొదలు పెడతారని అనుకోవచ్చు.