కాలా తెలుగు రైట్స్.. బేరం తెగట్లేదట..!

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా పా రంజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కాలా. కబాలి తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఏప్రిల్ 27న రిలీజ్ అని ఎనౌన్స్ చేసినా తెలుగులో ఇంతవరకు ఈ సినిమా కొనలేదని టాక్. అదేంటి అంటే వండర్ బార్ ప్రొడక్షన్స్ లో ధనుష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళంలో చెప్పిన రేటుకి కొనేస్తున్నా తెలుగులో మాత్రం సీన్ అలా లేదట.

రజిని గత సినిమాలు దెబ్బేయడంతో కాలాను తమకు అనుకూలంగా రాబట్టాలని చూస్తున్నారట. కాలా నిర్మాతలు 40 కోట్లకు తెలుగు రైట్స్ చెబుతుంటే తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం 30 కి అటు ఇటు అంటున్నారట. టీజర్ తో సినిమా రేంజ్ పెంచేయొచ్చు అనిపించినా కబాలి టీజర్ చూసి సినిమా హిట్ అనుకోగా.. తమిళంలో రజిని క్రేజ్ తో ఆడింది కాని తెలుగులో మాత్రం అలా జరగలేదు. మరి కాలా తెలుగులో ఎవరి సొంతం అవుతుందో చూడాలి.