
రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మొదటి ప్రయత్నంగా వస్తున్న సినిమా నా పేరు సూర్య. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాంగ్రీ సోల్జర్ గా కనబడుతున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇక సినిమాలోని రెండు సాంగ్స్ ఇప్పటికే సూపర్ అనిపించేశాయి. విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మే 4న రిలీజ్ కాబోతుంది.
అయితే ఈ సినిమా నుండి ఓ కాన్సెప్ట్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. గాగుల్స్ తో పాటు నోట్లో సిగార్ కూడా పెట్టుకుని స్టైలిష్ స్టార్ అసలు సిసలు స్టైలిష్ లుక్ అనేలా ఈ పోస్టర్ ఉంది. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చేలా వచ్చిన ఈ పోస్టర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాను బన్ని వాసు, నాగబాబు సహ నిర్మాతలుగా ఉన్నారు.