
మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుక్కు కాంబోలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ రంగస్థలం. 1985 కాలం నాటి కథతో పల్లెటూరి నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో చరన్ చిట్టిబాబుగా కనిపిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మొదటి సాంగ్ ఎంత సక్కగున్నావో ఇప్పటికే రిలీజ్ అయ్యి దుమ్ముదులిపేయగా.. ఇప్పుడు ఈ సినిమా నుండి రంగా.. రంగా.. రంగస్థలానా అంటూ వచ్చే టైటిల్ సాంగ్ రాబోతుంది.
ఈ సాంగ్ రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తారట. అయితే దానికి ముందు తన టీం తో దేవి ఆ సాంగ్ బిట్ ను కాస్త వదిలాడు. అంతేకాదు చరణ్ ఆ సాంగ్ లో ఎలా ఉంటాడో ఆ పోస్టర్ కూడా వదిలారు. పక్కాగా చెప్పలంటే మాస్ బీట్ గా రాబోతున్న ఈ రంగస్థలం పాటతో మరోసారి దేవి తన సత్తా చాటబోతున్నాడని చెప్పొచ్చు. మార్చి 30న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి.