
వి6 తీన్మార్ వార్తల్లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న విషయాల మీద ఫోకస్ చేస్తారు. బిత్తిరి సత్తి తనదైన వ్యాఖ్యానంతో వార్తలను చెబుతూ ఎంటర్ టైన్ చేస్తాడు. అయితే అప్పుడప్పుడు కొన్ని సెటైర్లు కూడా వేస్తాడు. ఈ క్రమంలో శ్రీదేవి మరణం నుండి ఆమె అంత్యక్రియలు పూర్తయ్యే వరకు మీడియా చేసిన ఓవర్ యాక్షన్ కు బిత్తిరి మార్క్ సెటైరికల్ షో చేశాడు దాని పేరే తొట్టిలో రిపోర్టింగ్.
ముందు హార్ట్ ఎటాక్ తో చనిపోయింది అనుకున్న శ్రీదేవి బాత్ టబ్ లో మరణించిందని అన్నారు. అయితే మీడియా ఈ వార్తను కవర్ చేయాలనే ఉద్దేశంతో అత్యుత్సాహం చూపించారు. ఏకంగా బాత్ టబ్ నే వాడేశారు. ఇక కొందరు అందులో ఉండి న్యూస్ చదివారు. అయితే వీటన్నిటిని విశ్లేషిస్తూ సముద్రంలో ఎవరైనా గల్లెంతైతే సముద్రంలో మునుగుతూ తేలుతూ వార్తలు చదువుతారా.. విషం తాగి ఎవరైనా మరణిస్తే వీరు కూడా విషం తాగుతూ వార్తలు చదువుతారా అంటూ మీడియా మొత్తానికి పంచ్ వేశాడు. శ్రీదేవి న్యూస్ తెలుగు మీడియానే కాదు నేషనల్ మీడియా కూడా ఇలాంటి రచ్చ చేసిందని తెలిసిందే.