
స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో పిల్ల జమిందార్ అశోక్ డైరక్షన్ లో వచ్చిన సినిమా భాగమతి. ఈ సినిమా అంచనాలను అందుకోవడమే కాదు భాగమతిగా అనుష్క రికార్డ్ కలెక్షన్స్ వసూళు చేసింది. ఇక ఈ సినిమాలో అనుష్క నటనకు అందరు ఫిదా అయ్యారు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా జనవరి 26న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.
ఇక ఈ సినిమా అలా థియేటర్లలోంచి వెళ్లిందో లేదో ఇలా నెట్ లో ప్రత్యక్షమైంది. అదెలా అంటారా.. అమేజాన్ ప్రైం లో భాగమతి వచ్చేసింది. ప్రీమియర్ సభ్యులంతా ఈ సినిమా చూసేయొచ్చు. భాగమతి సూపర్ హిట్ బొమ్మ.. మరి ఆ సినిమా ఇంతలోనే అమేజాన్ లో రావడం ఆశ్చర్యంగా ఉన్నా అమేజాన్ ఆఫర్ కు నిర్మాతలు కాస్త ఆశ పడి ఇలా చేశారని తెలుస్తుంది.