
నాచురల్ స్టార్ నాని హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా రాబోతుందని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ అప్డేట్. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని ప్రస్తుతం మేర్లపాక గాంధితో కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత నాని త్రివిక్రం తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయట.
ఇప్పటికే నానికి కథ అందించాడట త్రివిక్రం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో సినిమా చేయాల్సి ఉంది. మార్చి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ కు వెళ్తుంది. నానితో త్రివిక్రం అంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించేసుకోవచ్చు. త్రివిక్రం మార్క్ మాటలను నాని లాంటి నాచురల్ స్టార్ చెబితే ఎలా ఉంటుందో చూడాలి.