అక్కినేని హీరోల బాక్సాఫీస్ ఫైట్..!

అనూహ్యంగా అక్కినేని తండ్రి కొడుకులిద్దరు బాక్సాఫీస్ దగ్గర ఫైట్ కు సిద్ధమయ్యారు. నాగార్జున హీరోగా రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో వస్తున్న ఆఫీసర్ సినిమా మే 25న రిలీజ్ ప్లాన్ చేశారు. ఇక మే చివరి వారంలో నాగ చైతన్య చందు మొందేటిల సవ్యసాచి సినిమా కూడా రిలీజ్ ఫిక్స్ అంటున్నారు. అక్కినేని హీరోల బాక్సాఫీస్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. 

నిన్న రిలీజ్ అయిన నాగాజున ఆఫీసర్ ఫస్ట్ లుక్ ఇంప్రెస్ చేయగా.. సవ్యసాచి ఓ కొత్త కథతో రాబోతుందని తెలుస్తుంది. చైతుకి ప్రేమం హిట్ ఇచ్చిన చందు మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటారా లేక ఒకే డేట్ నే తండ్రికొడుకులు ఫైట్ కు దిగుతారా అన్నది తెలియాల్సి ఉంది. మార్చి 30 నుండి మే 18 వరకు వరుస సినిమాలు రిలీజ్ ప్లాన్ చేయగా.. మార్చి చివరి వారంలో సవ్యసాచి రిలీజ్ అనుకున్నారు. కాని నాగార్జున ఆఫీసర్ కూడా మే 25న రిలీజ్ అని ఎనౌన్స్ చేయగా.. రెండు సినిమాలు క్లాష్ అవుతున్నాయి. మరి వీటిలో ఏది ముందుకు ఏది వెనక్కి జరుగుతుందో చూడాలి.